Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ కుర్రాడిని రేష్మి పెళ్లి చేస్కుంటుందా... గింజుకుంటున్న యాంకర్...

నేను విశాఖలోనే సెటిలవుతా అని యాంకర్ కమ్ నటి రేష్మి అన్న మాటలపై ఇప్పుడు టాలీవుడ్లో రకరకాల గుసగుసలు పోతున్నాయి. రేష్మి చెప్పిన మాటలను చూస్తుంటే ఆమె విజయవాడకు చెందిన ఓ కుర్రాడిని పెళ్లి చేస్కుంటుందంటూ చెప్పుకుంటున్నారు. ఆ విజయవాడ కుర్రాడు ఎవరయ్యా అంటే స

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (14:47 IST)
నేను విశాఖలోనే సెటిలవుతా అని యాంకర్ కమ్ నటి రేష్మి అన్న మాటలపై ఇప్పుడు టాలీవుడ్లో రకరకాల గుసగుసలు పోతున్నాయి. రేష్మి చెప్పిన మాటలను చూస్తుంటే ఆమె విజయవాడకు చెందిన ఓ కుర్రాడిని పెళ్లి చేస్కుంటుందంటూ చెప్పుకుంటున్నారు. ఆ విజయవాడ కుర్రాడు ఎవరయ్యా అంటే సుడిగాలి సుధీర్ అంటున్నారు. ఎటొచ్చీ మళ్లీ సుడిగాలి దగ్గరే ఆగుతున్నారు. 
 
ఆమధ్య కూడా జబర్దస్త్ యాంకర్ రష్మికి, ఆ కార్యక్రమంలో పార్టిసిపెంట్ సుడిగాలి సుధీర్‌కు అఫైర్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అదే విషయాన్ని రష్మిని అడిగితే ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటారు. తనకు పోయేదేముంది అంటూ కామెంట్ చేసింది. ఈ అఫైర్ వ్యవహారంపై సుడిగాలి సుధీర్ స్పందించాడు.
 
తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని స్పష్టం చేశాడు. కేవలం స్కిట్లో నవ్వులను ఎక్కువుగా జోడించడానికి తనను రష్మితో లింక్ చేస్తుంటారని, అంతేకాకుండా తనకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్లు స్కిట్లు రాస్తుంటారని పేర్కొన్నారు. వీటి వల్ల తన క్యారెక్టర్ చాలా చెడ్డదన్న ప్రచారం జరిగిపోయిందని, దీంతో తనకూ ఎవరూ పిల్లనివ్వడానికి కూడా ముందుకు రావట్లేదని నవ్వేశాడు.
 
కేవలం కామెడీ కోసం వాడిన డైలాగులతో తనకు, రష్మీకి సంబంధం అంటగట్టేశారని అన్నాడు. నిజానికి చెప్పాలంటే తన జీవితంలో ఇంతకుముందే ఒకసారి లవ్ ఫెయిల్ అయిందని, తనకు పెళ్ళి చేసుకునే ఆలోచన కూడా లేదని వివరించాడు. ఇక తరచూ బ్రేక్ తీసుకుంటానని, రెండు రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటానని వివరించాడు. 
 
రేష్మి కూడా విశాఖలో సెటిలవుతానంటే ఆంధ్రకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అర్థం కాదని అంటోంది. విశాఖలో సెటిలవుతానని చెప్పినందుకు ఇంత రాద్ధాంతమా అని గింజుకుంటోంది. సెలబ్రిటీలు ఏం మాట్లాడినా దాన్ని తీగలాగి డొంకంతా పంచడం మామూలే కదా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

తెలంగాణలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం

యావదాస్తి దానం చేస్తానంటున్న బిల్ గేట్స్ - అద్భుతమైన నిర్ణయమంటూ మెలిండా గేట్స్!!

భారత రక్షణ అధికారులుగా నటిస్తూ సమాచార సేకరణ.. ఆ నెంబర్ నుంచి కాల్స్ వస్తే?

ఆంధ్రలోని 115 చెంచు గిరిజన కుటుంబాలకు సాధికారత: హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ ఆగ్రోఫారెస్ట్రీ కార్యక్రమం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments