Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యామీనన్ కటీఫ్... విడాకులు తీసుకుంటామని కోర్టుకెళ్లని సినీజంట... కోర్టు ఫైర్

ఈగలో నటించిన కన్నడ నటుడు సుదీప్ మనకు తెలుసు. ఈయన కొన్నాళ్ల క్రితం ఆయన భార్యకు విడాకులిస్తున్నట్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. సుదీప్ భార్య కూడా తను విడాకులు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించింది. ఈ విడాకులకు కారణం నిత్యా మీనన్ అంటూ అప్పట్లో కన్నడ చి

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (13:34 IST)
ఈగలో నటించిన కన్నడ నటుడు సుదీప్ మనకు తెలుసు. ఈయన కొన్నాళ్ల క్రితం ఆయన భార్యకు విడాకులిస్తున్నట్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. సుదీప్ భార్య కూడా తను విడాకులు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించింది. ఈ విడాకులకు కారణం నిత్యా మీనన్ అంటూ అప్పట్లో కన్నడ చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపించాయి. సుదీప్-నిత్యా మీనన్ ఇద్దరూ ఒకే అపార్టుమెంట్లో సహజీవనం మొదలుపెట్టారనీ, నిత్యా మీనన్ కు కన్నడలో అవకాశాలు ఇప్పించేందుకు సుదీప్ తన శక్తినంతా ప్రయోగించేవాడంటూ వార్తలు కూడా వచ్చాయి. 
 
వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ కన్నడ సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ వచ్చాయి. కానీ దీనిపై అటు నిత్యా మీనన్ కానీ ఇటు సుదీప్ కానీ నోరు మెదపలేదు. ఐతే తాజాగా ఓ వ్యవహారం బయటకు వచ్చింది. కోర్టులో విడాకులకు పిటీషన్లు పెట్టుకున్న సుదీప్ ఆయన భార్య విడాకుల కేసుకు హాజరు కావడం లేదట. జూన్ 14న కోర్టులో విడాకుల కేసు నిమిత్తం హాజరు కావాల్సి వున్నా ఇద్దరూ పత్తాలేకుండా పోయారట. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం వారిరువురూ విడాకులు తీసుకునేందుకు సుముఖంగా లేరట. దీనికి కారణం... సుదీప్ తో నిత్యా మీనన్ కటీఫ్ చేసుకున్నదట. కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య కొన్ని తేడాలు రావడంతో నిత్యా పక్కకు వెళ్లిపోయినట్లు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక మనం విడాకులు తీసుకోవడం దేనికి అని సుదీప్ తన భార్యతో అంటున్నాడట. మరి ఇందులో నిజమెంత వుందో తేలాల్సి వుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments