Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నిన్నుకోరి'' ట్రైలర్ అదుర్స్.. నాని, ఆది, నివేదా నటనే ప్లస్- తననే ప్రేమించే.. చావైనా బ్రతుకైనా? (ట్రైలర్)

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను, నేను లోకల్‌ వంటి వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న నాని తాజాగా ''నిన్నుకోరి'' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డి.వి.వ

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (12:21 IST)
ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను, నేను లోకల్‌ వంటి వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న నాని తాజాగా ''నిన్నుకోరి'' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. 
 
ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి. ఇక తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులోని డైలాగ్స్, మ్యూజిక్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి. జూలై 7న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 
 
నివేదా థామస్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. గోపి సుందర్ సంగీతం అందించిన ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ట్రైలర్‌లో నాని, నివేదా, ఆది ముగ్గురే కనిపించడం విశేషం.
 
నాని టైమింగ్‌, జోవియ‌ల్ న‌ట‌న‌.. ట్రైల‌ర్‌ను చూస్తే అదుర్స్ అనిపిస్తోంది. తననే ప్రేమించా.. తననే పెళ్లిచేసుకోవాలనుకున్నా.. చావైనా బ్రతుకైనా తనతోనే అనుకున్నా అంటూ నాని చెప్పిన డైలాగ్ అదిరింది. మొత్తానికి ఈ సినిమాను అంచనాలు పెంచే దిశగా నిన్ను కోరి ట్రైలర్ వుందని సినీ పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments