Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్ తేజ్‌ చిత్రంలో ఐటమ్ గర్ల్‌గా అనసూయ... పవన్‌కు హ్యాండ్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్ ప్రతి సినిమాలో తన అభినయంతో, డాన్సుతో ఆద్యంతం ప్రేక్షకుల మన్నలను పొందుతున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చి కొద్దికాలమే అయినా స్టార

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (12:05 IST)
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్ ప్రతి సినిమాలో తన అభినయంతో, డాన్సుతో ఆద్యంతం ప్రేక్షకుల మన్నలను పొందుతున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చి కొద్దికాలమే అయినా స్టార్ హీరోలకి ధీటుగా పేరుసంపాదించుకున్న ఈ యువ హీరో 'తిక్క' సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కెరీర్‌కి కరెక్టుగా సరిపోతుందని భావిస్తున్నారు.
 
హీరోగా వచ్చినప్పటి నుండి తన జోష్‌తో ఎలాగైతే విన్నర్‌గా నిలుస్తున్నాడో అలాగే ఈ సినిమాకి 'విన్నర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది. 
 
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందిస్తున్నాడు. ఇదిలావుంటే ఈ సినిమాలో బుల్లితెర అందాల భామ అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సాంగ్ ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందనీ, అనసూయ క్రేజ్‌ను మరింత పెంచుతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి అనసూయ పవన్ కళ్యాణ్ చిత్రంలో ఐటమ్ గర్ల్‌గా నటించాల్సి ఉండగా, అక్కడ కాదనీ సాయితో కలిసి నటించనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments