Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనన్య పాండే దశ తిరిగేనా? లేక అడ్రస్ లేకుండా పోతుందా?

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (14:13 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం "లైగర్".. (సాలా క్రాస్‌బ్రీడ్). పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పలువురు పేర్లను పరిశీలించారు. ముఖయంగా, జాన్వీ కపూర్, నిధి అగర్వాల్ వంటి కుర్ర హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. చివరకు అనన్యా పాండేను ఎంపిక చేశారు. పైగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయని .. ఆసీన్స్ యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటాయని చెప్పుకుంటున్నారు.
 
నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న లైగర్ సినిమాతో అనన్య పాండేకి ఎలాంటి ఇమేజ్ వస్తుందన్నది చాలా మంది టాక్. పూరి జగన్నాధ్ దగ్గర.. ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చాలామంది మోడల్స్.. హీరోయిన్స్‌కి సంబంధించిన ఫొటోస్ ఆల్బం నిండుగా ఉంటుంది. అందులో నుంచి సెలెక్ట్ చేసుకున్న అనన్య పాండే.. పూరి ఇప్పటివరకు పరిచయం చేసిన స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరుతుందా.. లేక అసలు అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్స్‌ లిస్ట్‌లో చేరుతుందా అన్నది కొందరి సందేహంగా ఉంది. 
 
వాస్తవంగా పూరి సినిమాలలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్‌కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. గ్లామర్‌గా చూపించడంలో పూరి జగన్నాధ్ తర్వాతే ఎవరైనా. అయినా కూడా కొందరు హీరోయిన్స్ అసలు కనిపించకుండా పోయారు. సూపర్ సినిమాతో పరిచయం అయిన అనుష్క శెట్టి, ఆ తర్వాత సినిమాలతో వచ్చిన ఆసిన్, రక్షిత‌లాంటి వాళ్ళు స్టార్స్‌గా వెలిగారు. ఇప్పుడు అనన్య ఏ లిస్ట్‌లోకి వస్తుందన్నది అందరిలో కలుగుతున్న ఆసక్తి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments