Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జీవితం తలుచుకుంటేనే కష్టాలపాలు, కన్నీళ్ళు పెట్టుకున్న అమలాపాల్

Webdunia
శనివారం, 17 జులై 2021 (16:07 IST)
అమలాపాల్. మొదటి సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా మంచి మార్కులే కొట్టేశారు. ఇక వరుస సినిమాలతో బిజీగా మారిన ఈమె నాగచైతన్యతో నటించిన బెజవాడ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.
 
సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోను నిత్యం వార్తల్లో ఉంటారు అమల. గతంలో దర్సకుడు ఎ.ఎల్. విజయ్‌ను వివాహం చేసుకున్న అమలాపాల్ అనంతరం కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇటీవల అమల మరో వివాహం చేసుకున్నారనే ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
 
అయితే దీనిపై అమలాపాల్ స్పందించలేదు. అయితే తాజాగా కెరీర్ పైన దృష్టి పెట్టిన అమలాపాల్ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఒకే చెబుతూ దూసుకెళుతున్నారు. ఆహా, ఓటిటిలకు వేదికలైన కుడి ఎడమైతే సినిమాలో ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
17 యేళ్ళ ప్రాయంలో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టానని చెప్పిన అమల.. రియల్ లైఫ్‌లో ఎదుర్కొన్న చాలా విషయాలను రీల్ లైఫ్ లోను అనుభవించానని చెప్పారు. ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఆ సమయంలో తెలియలేదన్నారు. 
 
2020లో నాన్న చనిపోయారని ఆ సమయంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయని.. నాకంటూ ప్రత్యేకమైన జీవితం ఏదీ లేదంటూ గ్రహించానని అమలాపాల్ చెప్పారు. కష్టాలు వచ్చిన సమయంలో నా జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.
 
కానీ ఇప్పుడు నా ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు నేను నేనుగా జీవిస్తున్నాను. సినీ జీవితాన్ని, నిజ జీవితాన్ని వేరు చేసి ముందుకు సాగుతున్నానంటోంది అమల. తన సినిమా జీవితంలో కూడా మార్పులు వచ్చాయంటోంది. ఈ క్రమంలోనే పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments