Webdunia - Bharat's app for daily news and videos

Install App

Allu Arjun latest update: పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రం తాజా అప్ డేట్

డీవీ
బుధవారం, 11 డిశెంబరు 2024 (13:43 IST)
దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప 2 ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో డివైడ్ టాక్ తో వసూళ్ళు తగ్గినా ఇతర చోట్ల బాగానే వున్నట్లు రిపోర్ట్ లు చెబుతున్నాయి. అల్లు అర్జున్ కూడా కొంతకాలం విశ్రాంతి తీసుకుని సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో వున్నారు. కాగా, తన తదుపరి సినిమాకోసం దర్శకుడితో కసరత్తు చేస్తున్నాడు. జులాయి, అలవైంకుంఠపురంలో చిత్రాల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే అల్లు అర్జున్ కలిసినట్లు తెలిసింది. వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.
 
తాజా సమాచారం ప్రకారం పీరియాడిక్ కథాంశాన్ని దర్శకుడు ప్రిపేర్ చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన నటీనటుల ఎంపిక బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి కూడా తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 చిత్రానికి ధీటుగా తన సినిమా వుండబోతుందని త్రివిక్రమ్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్. ఎంటర్ టైన్ మెంట్ తోపాటు సీరియస్ అంశాలు కూడా వుంటాయి. పీరియాడిక్ కథ కాబట్టి అందుకు సంబంధించిన గెటప్ కోసం అల్లు అర్జున్ కూడా కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్ పై రాధాక్రిష్ణ నిర్మించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments