Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి తర్వాత బన్నీని టార్గెట్ చేసిన ఆ దర్శకుడు?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (08:55 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ దర్శకుల్లో కొరటాల శివ. సామాజిక నేపథ్యంతో చిత్రాలు తీస్తూ ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో "ఆచార్య" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవాయల భూముల స్కామ్‌లను ఈ చిత్రంలో చూపించనున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, ఈ చిత్రం తర్వాత కొరటాల శివ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
 
నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో ఎప్పటి నుంచో ఉంది. అది ఎట్టకేలకు ఇప్పుడిది కార్యరూపం దాల్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. 
 
బలమైన సామాజిక సందేశమున్న కథాంశంతోనే కొరటాల తనదైన శైలిలో ఈ స్క్రిప్ట్‌ను రాసుకున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. 
 
కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్‌ లెక్కల మాస్టారు సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య'ను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే వీళ్లిద్దరి కలయికలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments