Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజా... మా అబ్బాయితో ఒక్క సినిమా ప్లీజ్(వీడియో)

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్. యువ కథానాయకుల్లో ముందుకు దూసుకుపోతున్న హీరో. మాస్ హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించుకున్నారు. అయితే భారీ హిట్లు మాత్రం పెద్దగా అల్లు అర్జున్‌కు లేవు. రామ్ చరణ్ కన్నా ముందు నుంచే అల్లు అర్జున్ సినిమాల్లో ఉన్నారు. కానీ

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (17:21 IST)
స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్. యువ కథానాయకుల్లో ముందుకు దూసుకుపోతున్న హీరో. మాస్ హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించుకున్నారు. అయితే భారీ హిట్లు మాత్రం పెద్దగా అల్లు అర్జున్‌కు లేవు. రామ్ చరణ్ కన్నా ముందు నుంచే అల్లు అర్జున్ సినిమాల్లో ఉన్నారు. కానీ రామ్ చరణ్‌‌కు ఎన్నో హిట్లు ఉన్నాయి. అందులోను భారీ హిట్లే. ఇది అందరికీ తెలిసిన విషయమే. మగధీర సినిమాతో రామ్ చరణ్‌ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటి సినిమానే తీసి తన కుమారుడి రేంజ్ పెంచాలన్నదే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆలోచన. 
 
ఇదే విషయాన్ని రాజమౌళికి చెప్పారట అల్లు అరవింద్. మంచి కథతో అర్జున్ మైలేజ్ ఒక్కసారిగా పెరగాలని అరవింద్ కోరారట. సమయం, ఖర్చు ఎంతయినా ఫర్వాలేదు సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉండాలని అన్నారట. అల్లు అరవింద్ లాంటి గొప్ప నిర్మాత అడిగితే రాజమౌళి కాదంటారా. 
 
అయితే ఐదు సంవత్సరాల పాటు బాహుబలి-1, బాహుబలి-2 సినిమాతో ఎక్కువ సమయాన్ని కేటాయించిన రాజమౌళి కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట. మంచి కథను ఆలోచించి కొద్దిగా గ్యాప్ తరువాత షూటింగ్ ప్రారంభిద్దామని, అయితే సినిమా తీయడం మాత్రం ఖాయమని అల్లుకు హామీ ఇచ్చారట రాజమౌళి. చిరంజీవి ప్లేస్ కోసం బన్నీ లుక్కేస్తున్నాడా... చూడండి వీడియోను...
అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments