Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకెందుకిక హీరో పాత్ర అంటున్న అల్లరి నరేష్...

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (19:12 IST)
మహర్షి తరువాత అల్లరి నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయిపోతున్నాడు. కేవలం హీరో వేషాలే వేస్తానని భీష్మించుకు కూర్చోకుండా మహర్షి ఆశీస్సులతో వస్తున్న ఇంపార్టెంట్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు నరేష్. ఆర్రెడీ రవితేజ సినిమాలో సెలెక్ట్ అయ్యాడు ఈ అల్లరోడు. 
 
సుడిగాడు తరువాత ఒక్క హిట్ లేని ఇతడికి మహర్షి సక్సెస్ తీసుకొచ్చింది. కెరీర్లో మంచి గుర్తింపును తీసుకురావడమే కాదు మరిన్ని కాన్సెప్ట్‌లతో రావడానికి మహర్షి దారిచూపింది. సినిమాలో మహేష్ మూడు షేడ్స్‌లో కనిపించినా నరేష్ పోషించిన రవి పాత్రకు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు వచ్చింది. 
 
నవ్వించడమే కాదు గమ్యం సినిమాలోలా మరోసారి సెంటిమెంట్‌తో ఆకట్టుకున్నాడు నరేష్. హీరోగా పది సినిమాలు చేసినా రాని హిట్ మహర్షిలోని రవి పాత్ర తీసుకొచ్చింది. హీరో ఎవరైనా గుర్తింపు తెచ్చే రోల్ ఏదైనా వేయవచ్చని మహర్షి నిరూపించడంతో అటుగా అడుగులు వేస్తూ రవితేజ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నరేష్‌.
 
ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ ఆనంద్, రవితేజ కాంబినేషన్లో రూపొందుతున్న డిస్కో రాజా షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్‌లో నడుస్తోంది. ఇంపార్టెంట్ రోల్ కోసం నరేష్‌ను ఎంచుకున్నాడు దర్శకుడు. మహర్షిలోని రవి పాత్ర నరేష్‌కు రవితేజ సినిమాలో ఆఫర్‌ను తీసుకొచ్చింది. శంబోశివ శంబో తరువాత రవితేజ, నరేష్‌ కలిసి నటిస్తున్న రెండవ సినిమా ఇది. ఒకవైపు హీరోగా మరోవైపు ఇంపార్టెంట్ రోల్స్‌తో నరేష్ గతంలో మాదిరి బిజీ అయిపోయి యేడాదికి నాలుగైదు సినిమాలతో పలుకరిస్తాడేమో అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments