Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 3కి ఓకే చెప్పి తప్పు చేశానా? (video)

Webdunia
బుధవారం, 17 జులై 2019 (12:51 IST)
బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అయ్యాయి. కోట్లాది మందిని ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ 3 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈసారి హోస్ట్‌గా నాగార్జున వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ నెల 21 నుంచి ఈ షోను ప్రారంభించ‌నున్నారు.

అయితే... ఊహించ‌ని విధంగా ఈ షో ప్రారంభం కాకుండానే అవాంత‌రాలు ఏర్ప‌డుతున్నాయి. బిగ్ బాస్ షో నిర్వాహ‌కులపై యాంకర్‌, జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రియాల్టీ షోపై మరో పిటిషన్‌ దాఖలైంది.
 
ఇంత‌కీ ఈ పిటిష‌న్ ఏంటంటే... ఈ షోలో అభ్యంతరకర సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అందుకే సినిమాలాగే ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్‌ చేసి ప్రసారం చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా రాత్రి 11 గంటల తర్వాతే బిగ్‌బాస్‌ 3 షో ప్రసారం చేయాలంటూ పిటిషినర్‌ కోరినట్లుగా తెలిసింది. బిగ్‌బాస్‌ షో కో-ఆర్డీనేషన్‌ టీం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ షోపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 
 
బిగ్‌బాస్‌ 3పై బంజారాహిల్స్‌, రాయదుర్గం పోలీసు స్టేషన్‌లలో నమోదైన కేసులను వెంటనే కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొంది. కాగా బిగ్‌బాస్‌ టీం దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను అనుమతించ‌వద్దంటూ జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైకోర్టు వద్ద నిరసనకు దిగారు. దీంతో అస‌లు షో స్టార్ట్ కాకుండానే ఈ కేసులు ఏంటి..? ఈ షోకి హోస్ట్‌గా చేయ‌డానికి ఓకే చెప్పిన త‌ప్పు చేసానా అని నాగ్ తెగ ఫీల‌వుతున్నాడ‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా.. ఎవరినైనా చంపొచ్చా : మంత్రి కోటమిరెడ్డి (Video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. బోరున విలపిస్తున్న ఓ తల్లి!! (Video)

Mohan Babu: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

Seethakka: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డా.. జై భీమ్‌కు అలాంటి గౌరవం లభించలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments