Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ - వీరు పోట్ల కాంబినేషన్లో మూవీ నిజమేనా..?

Webdunia
బుధవారం, 15 జులై 2020 (15:03 IST)
అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది.
 
స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అఖిల్ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపుగా ఈ మూవీ ఫిక్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... అఖిల్ వీరు పోట్లతో సినిమా చేయనున్నట్టు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ తర్వాత వీరు పోట్లతో సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది.
 
గతంలో వీరు పోట్ల నాగార్జునతో రగడ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించింది. అయితే.. ఇప్పుడు అఖిల్‌తో వీరు పోట్ల మూవీ అనగానే నిజమా..? కాదా..? అనేది చర్చనీయాంశం అయ్యింది. టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిన ఈ కాంబినేషన్ గురించి ఆరా తీస్తే... ఇందులో వాస్తవం లేదని తెలిసింది.
 
వీరు పోట్లను అడిగితే... అసలు తను అలాంటి ప్రయత్నాల్లో లేనని... నిజంగా అఖిల్‌ను డైరక్ట్ చేసే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనని చెప్పాడు. సునీల్‌తో ఈడు గోల్డు ఎహే అనే సినిమా తీసాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాను చేయలేదు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments