పాపం... అఖిల్‌కి గాయమైంది, షూటింగ్ ఆగింది

శనివారం, 7 మార్చి 2020 (15:49 IST)
అక్కినేని అందగాడు అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. 
 
అయితే... ఈ సినిమా షూటింగ్‌లో అఖిల్‌కి గాయాలు అయ్యాయి. షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఈ సినిమా సమ్మర్‌కి రావడం కష్టమే అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమా కాదా అని ఆరా తీస్తే... చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తుంటే.. అఖిల్‌కి గాయాలు అయ్యాయి అని తెలిసింది. అఖిల్ చేతికి గాయం అయిన వెంటనే.. హాస్పటల్‌కి వెళ్లడం చికిత్స చేయించుకోవడం జరిగింది. డాక్టర్లు రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పినట్టు సమాచారం. 
 
ప్రస్తుతం అఖిల్ లేకుండా వేరే సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి అఖిల్ షూటింగ్‌లో జాయిన్ అవుతారని... అఖిల్, పూజా హేగ్డేలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన మనసా మనసా సాంగ్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. గోపీ సుందర్ సంగీత దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటి రిలీజ్ చేయనున్నారు. త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. ఏప్రిల్ నెలలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు.. విడుదల తేదీ ఎప్పుడు అనేది త్వరలో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తామన్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... మే నెలాఖరులో రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారు. మరి.. ఈసారి బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటూ వస్తున్న అఖిల్ సక్సస్ సాధిస్తాడని ఆశిద్దాం. ఎందుకంటే ఇందులో పూజా హెగ్దె నటిస్తోంది. ఈమె నటించిన సినిమాలన్నీ ఇప్పుడు దాదాపు సక్సెస్ కొడుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ''ఉప్పెన''లా సాగుతున్న ఆ పాట.. యూట్యూబ్‌లో వైరల్