Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''మరక్కార్'' సినిమా ట్రైలర్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది..

Advertiesment
''మరక్కార్'' సినిమా ట్రైలర్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది..
, శనివారం, 7 మార్చి 2020 (10:52 IST)
Marakkar
''మరక్కార్'' సినిమా ట్రైలర్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ విడుదల చేశారు. మలయాళ సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్షన్‌లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో కనిపస్తున్నారు. ఆయన సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. 
 
ఇతర ప్రధాన పాత్రల్లో అర్జున్, ప్రభు, సునీల్ శెట్టి, సుహాసిని వంటీ సీనియర్ నటులు నటిస్తున్నారు. మార్చి 26న విడుదలకానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
'మరక్కార్'ను ప్రధానంగా 16వ శతాబ్దంలో కుంజలి మరక్కార్ అనే ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఆశిర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూరు నిర్మించాడు. రోనీ రాఫెల్ సంగీతం అందించాడు. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌పై దాడి.. పునర్నవి నోరెత్తలేదే.. ఏమైంది? గ్యాప్ వచ్చిందా?