Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్న అకీరా నందన్

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (08:14 IST)
తన తండ్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్‌తో కలిసి తనయుడు అకీరా నందన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. పవన్ హీరోగా ఓజీ అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. సుజిత్ దర్శకుడు. ముంబై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ మూవీగా రూపొందిస్తున్నారు. గతయేడాది రిలీజైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమా గురించి మరోమారు ఓ క్రీజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది. 
 
ఓజీలో పవన తనయుడు అకీరా నందన్ నటించనున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్​కి పూనకాలు రావడం ఖాయం. ఎందుకంటే పవన్​ను స్క్రీన్​పై చూసి అభిమానులు పూనకం వచ్చినట్లు కేరింతలు కొడతారు. అలాంటిది పవన్‌, ఆయన కుమారుడు అకీరా నందన్​ ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల హంగామా మరో స్థాయిలో ఉండటం ఖాయం. 
 
అయితే ఓజీలో అకీరా నందన్ పవన్ చిన్నప్పటి పాత్రను చేస్తారని సోషల్ మీడియా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పవన్​కు డైరెక్టర్ సుజీత్ అకీరా పాత్ర గురించి చెప్పారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరికొందరు ఓజీలో అకీరా గెస్ట్ రోల్ లేదా ప్రత్యేకమైన పాత్ర చేస్తారని అంటున్నారు. ఒకవేళ పవన్ ఓజీలో అకీరా నటిస్తే అదే అతడి డెబ్యూ మూవీ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments