"ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్.." అంటున్న చై - శోభిత

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (13:15 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ళలు త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అయితే, నాగ చైతన్య తనకు కాబోయే భార్యతో దిగిన స్పెషల్ ఫోటోలను తాజాగా నెటిజన్లకు షేర్ చేశారు. ఇందులో వీరిద్దరూ ట్రెండీ లుక్స్‌లో మెరిసిపోతున్నారు. "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్" అని క్యాప్షన్ పెట్టారు. అయితే, ఈ ఫోటో కింద ఉండే కామెంట్స్ సెక్షన్ మాత్రాన్ని మ్యూట్ చేశారు. అదేసమయంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
చై - శోభిత ఎంతో కాలంగా స్నేహితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సతీమణి, హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య కొంతకాలం బ్యాచిలర్ జీవితాన్ని గడిపారు. ఇపుడు శోభతను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నిశ్చితార్థంపై శోభిత స్పందిస్తూ, 
 
"మా ఎంగేజ్‌మెంట్ వేడుక గ్రాండ్‌గా జరగాలని నేను ఎపుడూ ప్రణాళికలు వేసుకోలేదు. జీవితంలో ముఖ్యమైన ఆ క్షణాలను ఆస్వాదించాలని అనుకున్నా. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఇలాంటి వేడుకలు జరగాలని ఎపుడూ అనుకునేదాన్ని. సంస్కృతి, సంప్రదాయాలకు నా తల్లిదండ్రులు ఎంతగానో విలువనిస్తారు. వాటితో నేను మమేకమయ్యాను. అనుకున్న విధంగానే సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ప్రశాంతంగా జరిగింది. అందమైన క్షణాలతో నా మనస్సు నిండింది. అది నిరాడంబరంగా జరిగిందని అనుకోవడం లేదు" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రమాదం : భారతీయ కుటుంబానికి భారీ ఊరట

మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments