Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఆఫర్ తెచ్చిపెట్టిన ఐశ్వర్య పోలికలు

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (20:00 IST)
బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యా రాయ్. ఈమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా, ఐశ్వర్య అందాన్ని చూస్తే ఆడోళ్ళే కుళ్ళుకుంటారు. అందమంటే అలా ఉండాలంటూ ఆమెను ఉదాహరణగా చెపుతుంటారు. అందుకే, ఆమెకు విరీతమైన ఫాలోయింగ్ ఉంది. 
 
పైపెచ్చు.. సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో డిమాండ్ ఉంది. ఇక ఆమె పోలికలతో ఎవరైనా వున్నారంటే.. ఆ అమ్మాయిలకు కూడా ఇట్టే క్రేజ్ వచ్చేస్తుంది. పైపెచ్చు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అమృత విషయంలోనూ అదే జరుగుతోంది.
 
ఇంతకీ ఈ అమృత ఎవరన్నదే కదా మీ సందేహం. ఆమె ఓ కేరళ రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయి. ఐశ్వర్య పోలికలు బాగా కనిపిస్తాయి. అందుకే, ఆమె టిక్ టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తే చాలు.. ఆ వెంటనే విపరీతమైన వ్యూస్ వస్తాయి. 
 
గతంలో ఐశ్వర్య నటించిన దక్షిణాది సినిమాలలోని పాటల్ని, సీన్స్‌నీ అనుకరిస్తూ ఈ చిన్నది వీడియోలు తీసుకుని టిక్ టాక్‌లో పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఆ పోలికలే అమృతకు సినిమాలలో అవకాశం వచ్చేలా చేశాయి. 
 
'పికాసో' పేరిట సునీల్ దర్శకత్వంలో రూపొందే మలయాళ చిత్రంలో అమృత హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వరించింది. మరి, ఐశ్వర్య పోలికలు ఈ చిన్నదానికి మరెన్ని ఆఫర్లు తెస్తాయో చూడాలి! మొత్తంమీద.. అమృత చేసిన ఓ టిక్ టాక్ వీడియో ఇపుడు ఆమె దశనే మార్చివేసిందని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments