Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్రికల్చర్ ఆఫీసర్‌ను చెప్పుతో కొట్టిన బీజేపీ నేత సోనాలీ ఫోగట్

Advertiesment
అగ్రికల్చర్ ఆఫీసర్‌ను చెప్పుతో కొట్టిన బీజేపీ నేత సోనాలీ ఫోగట్
, శనివారం, 6 జూన్ 2020 (10:10 IST)
Sonali Phogat
కొందరు బీజేపీ నేతలు నోటి దురుసుగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు చేతికి కూడా పనిచెప్తారని నిరూపించారు సోనాలీ ఫోగట్. టిక్‌టాక్‌లో ఫేమస్ అయి, బీజేపీ లీడర్‌గా మారిన హర్యానాకు చెందిన సోనాలీ ఫోగట్ మరోసారి వార్తల్లో నిలిచారు. శుక్రవారం అగ్రికల్చర్​ మార్కెట్‌కు వెళ్లిన ఆమె అక్కడ రైతులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)కి చెందిన సుల్తాన్ సింగ్ అనే ఆఫీసర్ అభ్యంతరకరంగా కామెంట్ చేయడంతో సోనాలీ ఒక్కసారిగా మండిపడ్డారు. అంతేగాకుండా కాలి చెప్పు తీసుకుని ఆయనను మళ్లీ మళ్లీ కొట్టారు. దీంతో ఆమె కంప్లయింట్లను పరిశీలించి, అన్నింటినీ పరిష్కరిస్తానంటూ ఆయన ప్రాధేయపడటం వీడియోలో కనిపించింది. 
 
సోనాలీ చెప్పుతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ ఆఫీసర్ తర్వాత సారీ చెప్పడంతో ఆమె కేసు పెట్టలేదని వార్తలు వచ్చాయి. ఒక ఆఫీసర్‌పై దాడి చేసినందుకు ఆమెపై యాక్షన్ తీసుకోవాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.
 
సోనాలీ ఫోగట్ 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా.. భారత్ మాతాకీ జై అనని వాళ్ల ఓట్లకు విలువ లేదని కామెంట్ చేసిన ఆమె పెద్ద దుమారం రేపారు. గత ఏడాది తనపై దాడి చేశారంటూ అక్క, బావపై కూడా ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. మరి తాజాగా సోనాలీపై కేసు నమోదు అవుతుందా లేదా అనేది తెలియాల్సి వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీడియాను కొండ దించేందుకు టిటిడి కుట్ర?