Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజుని రంగంలోకి దింపిన అల్లు అరవింద్

Webdunia
శనివారం, 11 జులై 2020 (19:58 IST)
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఆహో అంటూ ఓటీటీ ఫ్లాట్ఫామ్ స్టార్ట్ చేయడం తెలిసిందే. దీనిని సక్సెస్ చేయడం కోసం అల్లు అరవింద్ సక్సస్‌ఫుల్ డైరెక్టర్స్‌ని రంగంలోకి దించారు. వంశీ పైడిపల్లి, క్రిష్, అనిల్ రావిపూడి.. ఇలా కొంతమంది దర్శకులు ఆహా కోసం వర్క్ చేస్తున్నారు. ఇటీవల మిల్కీబ్యూటీ తమన్నాతో ఓ షో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
తాజాగా ఆహా గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే... అల్లు అరవింద్ దిల్ రాజుని రంగంలోకి దింపారట. ఆహా కోసం మంచి కంటెంట్ సెలెక్ట్ చేసే బాధ్యతను దిల్ రాజుకి అప్పగించారని సమాచారం.
 
 అంతేకాకుండా.. ఓ వైపు ఆహా కోసం కంటెంట్ సెలెక్షన్ చేస్తూనే మరోవైపు ఆహా కోసం తను కూడా వెబ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయనున్నట్టు తెలిసింది. ఆల్రెడీ కొన్ని స్టోరీలు విని ఓకే చేసినట్టు టాక్.
 
ఎంతమంది దర్శకులను పెట్టుకున్నప్పటికీ.. ఆహాకి ఆశించిన స్ధాయిలో స్పందన రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుంది. దీంతో దిల్ రాజుని రంగంలోకి దింపితే వర్కవుట్ అవుతుందనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ ఇలా ప్లాన్ చేసారు. మరి.. ఈసారైనా అల్లు అరవింద్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments