Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ రసికుడేమో?.. మంచి అనుభవం వుందట!! : రాశీఖన్నా

Webdunia
సోమవారం, 4 మే 2020 (18:35 IST)
'ఊహలు గుసగుసలాడే' అనే చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రాశీఖన్నా. ఆ తర్వాత 2014లో వచ్చిన 'మనం' చిత్రంలో ఆమె కనిపించింది. అక్కడ నుంచి ఆమె సినీ కెరీర్ తిరుగులేకుండా సాగుతోంది. 'బెంగాల్ టైగర్', 'సుప్రీం' వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులో చివరగా నటించిన చిత్రం 'వెంకీమామ'. ఈ చిత్రంతోపాటు 'శ్రీనివాస కళ్యాణం', 'ప్రతి రోజూ పండగే' వంటి చిత్రాల విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
 
ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఆమె ఇంటికే పరిమితమైంది. పెరట్లో పూల చెట్లను పెంచుతూ కనిపిస్తోంది. అదేసమయంలో టిట్టర్‌లో తన అభిమానులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెపుతోంది. 
 
ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, 'ప్రస్తుతం ఇంటి దగ్గర మంచి పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి కారణం నా కుటుంబ సభ్యులు .. స్నేహితులే. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవడం మరో కారణం. 
 
తెలుగులో నేను అభిమానించే కథానాయిక సమంత. తెలుగు హీరోల్లో మహేశ్ బాబు .. అల్లు అర్జున్‌లతో నటించాలని వుంది. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను. ముఖ్యంగా, అల్లు అర్జున్ మంచి అనుభవమున్న హీరో. 
 
అలాగే, నేచురల్ స్టార్ నాని ఓ మంచి వ్యక్తి. ఇలాంటివారితో నటించాలని వుంది. ఇక పెళ్లిపై నాకంటూ కొన్ని అభిప్రాయాలు వున్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలే ఎక్కువ' అంటూ ఈ ఢిల్లీ భామ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments