Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీకు సినీమా ఛాన్స్ ఇప్పించా.. మరి నాకేం ఇస్తావ్'... ఆ హీరోయిన్‌తో హీరో!

సాధారణంగా వెండితెర వెలుగులు... తెర ముందు మాత్రమే. కానీ, నటీనటులు చీకటి కష్టాలు తెరవెనుక అన్నీఇన్నీకావు. వెండితెరపై కనిపించాలన్న ఒకేఒక్క ఆశతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ నానా కష్టాలు ఎదుర

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (06:42 IST)
సాధారణంగా వెండితెర వెలుగులు... తెర ముందు మాత్రమే. కానీ, నటీనటులు చీకటి కష్టాలు తెరవెనుక అన్నీఇన్నీకావు. వెండితెరపై కనిపించాలన్న ఒకేఒక్క ఆశతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ నానా కష్టాలు ఎదుర్కోవాల్సింది. ఈ కష్టాలకు ఏ ఒక్కరూ అతీతం కాదు.
 
సినిమా ఛాన్సులు దొరికినప్పటికీ.. స్టార్‌డమ్ వచ్చేంత వరకు వారికి చీకటి కష్టాలు తప్పవు. అదే చిన్నాచితకా వేషాలు వేసుకునే హీరోయిన్ల జీవితాల్లో అడుగడుగునా ఎన్ని అవమానాలు, విషాదాలు ఉంటాయన్నది బహిరంగ రహస్యం. 
 
తాజాగా ఓ హీరోయిన్ సినీపరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాన్ని బహిరంగపరిచింది. ఆమె పేరు వేద ఉరఫ్ అర్చన. ఈమె 'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా' చిత్రంలో నటించి కాస్తోకూస్తో పేరు సంపాదించుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ త్రిషకు స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత ఈ అమ్ముడుకు సరైన బ్రేక్ రాలేదు.
 
ఆ తర్వాత ఓ ప్రముఖ హీరో.. ఓ సినిమాలో అవకాశం ఇప్పించాడు. ఆ తర్వాత తన ఆఫీసుకు పిలిచి... నీకు ఛాన్స్ ఇప్పించాను.. కృతజ్ఞతగా మరి నాకేమిస్తావ్ అని అర్చనను అడిగాడట. ఈ మాట వినగానే తొలుత షాక్‌కు గురైన గోముఖ ఆ తర్వాత తేరుకుని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంది.
 
మీలాంటి గొప్ప నటుడుకు నేను ఏమివ్వగలను సార్ .. అంటూ లౌక్యంగా సమాధానం చెప్పి తప్పించుకుందట అర్చన. సినిమా ఇండస్ట్ర్రీలో కొనసాగాలంటే ఇలాంటి ఎన్నో అవమానాలు భరించక తప్పదని అర్చన అంటోంది. ఇలాంటి పనులు చేసేందుకు అంగీకరిస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని లేకుంటే కష్టాలు పడాల్సి వస్తుంది చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

Gratitude Boat Rally: కాకినాడలో మత్స్యకారుల బోట్ ర్యాలీ.. ఎందుకో తెలుసా?

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments