Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు పార్వతిదేవి.. నేడు బికినీభామ... ఆ హీరోయిన్‌కు నెటిజన్ల వార్నింగ్

ఆ మధ్య 'ఈడోరకం.. ఆడోరకం' అనే చిత్రం వచ్చిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో నటించిన భామ సోనారిక. ఈమె టాలీవుడ్‌లో నాగశౌర్య నటించిన జాదూగాడు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ, అంతకుము

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (05:49 IST)
ఆ మధ్య 'ఈడోరకం.. ఆడోరకం' అనే చిత్రం వచ్చిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో నటించిన భామ సోనారిక. ఈమె టాలీవుడ్‌లో నాగశౌర్య నటించిన జాదూగాడు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ, అంతకుముందే బుల్లితెరపై మంచి పాపులర్ నటి. ఎందుకంటే.. ఈ అమ్మడు పార్వతి దేవిగా బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
 
కానీ, బిగ్ స్క్రీన్‌లోకి అడుగుపెట్టాక.. తనలోని ఆధ్యాత్మిక చింతనకు స్వస్తిచెప్పి.. బికినీలు ధరించసాగారు. తన గ్లామర్‌తో హీరోలను ఆకర్షించగలిగింది కానీ, ప్రేక్షకుల మనసుల్లో స్థానం దక్కించుకోలేక పోయింది. ఫలితంగా అవకాశాలు కరవయ్యాయి. 'ఈడోరకం.. ఆడోరకం' చిత్రం తర్వాత ఈ భామకు మరో ఛాన్స్ రాలేదు. 
 
దాంతో మీడియా ఫోకస్ తనపై పడటానికి నానాపాట్లు పడుతోంది. ఆ క్రమంలో బికినీ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టింది. ఆ ఫోటోకి వ్యూస్ బాగానే వున్నాయి. ఇంతవరకు బాగానే వుంది. గతంలో ఈ అమ్మడికి బికినీ పిక్స్ పెట్టొద్దని నెటిజన్లు వార్నింగ్ ఇచ్చారు.
 
ఎందుకంటే బుల్లితెర సీరియల్‌లో పార్వతిదేవి క్యారెక్టర్ చేసి పాపులర్ అయ్యింది. పార్వతిదేవి లాంటి డివైన్ క్యారెక్టర్ చేసి, ఇలాంటి ఫోటోలు పెట్టడమేంటని కామెంట్స్ లేకపోలేదు. అయినా సరే.. డోంట్‌కేర్ అంటూ మళ్ళీ బికినీ ఫోటో పెట్టడంతో సోనారిక అదోరకం అంటూ చర్చించుకోవడం మొదలైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments