Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇంటర్‌ ఫస్టియర్‌లో కళ్లు నెత్తికెక్కేశాయి.. ఇంటికొచ్చాక చితక్కొట్టారు' : అంజలి

టాలీవుడ్ నటి అంజలి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ముఖ్యంగా.. ఇంటర్ చదివే రోజుల్లో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలు వివరించింది. ‘మళ్లీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండును’ అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింద

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (08:49 IST)
టాలీవుడ్ నటి అంజలి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ముఖ్యంగా.. ఇంటర్ చదివే రోజుల్లో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలు వివరించింది. ‘మళ్లీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండును’ అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. 
 
తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకాలను వివరిస్తూ... 'టెన్త్ క్లాస్‌ బాగా చదివేప్పటికి నా కళ్లు నెత్తిమీదకు వచ్చాయి. అంటే మా బ్యాచ్‌లో నేను ఫస్ట్‌ క్లాస్‌ అన్నమాట. అప్పట్లో చదివేదాన్ని. దానికి మించి అల్లరి చేసే దాన్ని. హైస్కూల్‌ వరకు నేనెప్పుడూ బంక్‌ కొట్టలేదు. ఇంటర్‌ ఫస్టియర్‌లో కళ్లు నెత్తికెక్కేశాయి. ఆ రోజుల్లో ‘నువ్వే కావాలి’ సినిమా విడుదలైంది. యూత్‌లో ఆ సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చింది.
 
దీంతో ఎలాగైనా ఆ చిత్రాన్ని చూడాలని ఫిక్సయిపోయాం. ఒక రోజు కాలేజీకి బంక్‌కొట్టి, కొంచెం ఎక్కువ దూరంలో ఉన్న సినిమా హాల్‌కు ఎవరూ చూడరనే ధైర్యంతో ఫ్రెండ్స్‌తో కలసి వెళ్లాను. నేను ఇంటికి వచ్చే లోపలే ఆ న్యూస్‌ లీకైపోయింది. దాంతో మావాళ్లు నన్ను చితక్కొట్టేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కాలేజీకి బంక్‌కొట్టి సినిమాకు గానీ, షికారుకు గానీ వెళ్లలేదు. ఆ రోజులు తలచుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో!' అని చెప్పుకొచ్చింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments