Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ అలా అవ్వాలా... అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న హీరో సునీల్

కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తరువాత హీరోగా మారిపోయిన వ్యక్తుల్లో సునీల్ ఒకరు. కమెడియన్‌గానే సునీల్‌ను తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తించారు. కానీ హీరోగా ఆదరించలేకపోయారు. హీరోగా సునీల్ చేసిన సినిమాలు కొన్ని హిట్టయినా ఆ తరువాత ఛాన్సులు

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (16:35 IST)
కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తరువాత హీరోగా మారిపోయిన వ్యక్తుల్లో సునీల్ ఒకరు. కమెడియన్‌గానే సునీల్‌ను తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తించారు. కానీ హీరోగా ఆదరించలేకపోయారు. హీరోగా సునీల్ చేసిన సినిమాలు కొన్ని హిట్టయినా ఆ తరువాత ఛాన్సులు లేకుండా పోయాయి. దీంతో కమెడియన్‌గానే సెటిలవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారట సునీల్. 
 
అందుకే హీరోగా ఎవరు ఇప్పుడు ఇంటికొచ్చి మాట్లాడినా మీకు దణ్ణం బాబు. నాకు హీరో ఛాన్సులు వద్దు. కమెడియన్‌గానే చేస్తానంటూ చెబుతున్నాడు. దీంతో సునీల్‌కు అవకాశాలు తన్నుకొస్తున్నాయట. అల్లరి నరేష్‌ నటిస్తున్న సినిమాలో సునీల్‌కు సెకండ్ ఇన్సింగ్స్ కమెడియన్‌గా అవకాశం వస్తోందట. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల నిర్మిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలోను, త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్న అరవిందసమేత సినిమాలో అవకాశాలు వచ్చాయట. గతంలోలా హీరోగా 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కాకుండా కేవలం కోటి రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్‌ను సునీల్ తీసుకుంటున్నారట. 
 
అయితే హీరోగా కాకుండా కమెడియన్‌గా నటించడానికి సునీల్‌కు సిక్స్ ప్యాక్ అడ్డొస్తోంది. గతంలోలా పొట్ట ముందుకు వేసుకుని కమెడియన్‌గా కనిపించాల్సి అవసరం వచ్చింది. దీంతో సునీల్ మళ్ళీ తిరిగి అలా అవ్వాలా అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నాడట. గత రెండురోజులకు ముందు కుటుంబ సభ్యులతో ఇదే విషయాన్ని చెప్పుకుని కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడట సునీల్.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments