పుష్ప కు యాక్ష‌న్ హైలైట్‌-వినాయ‌క్ స‌ల‌హాలు!

Webdunia
శనివారం, 17 జులై 2021 (20:05 IST)
sukku-vinayak
అల్లు అర్జున్, రష్మిక జంటగా న‌టిస్తోన్న సినిమా `పుష్ప`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రెండు పార్ట్ లు గా రాబోతున్నది. తాజాగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జూబ్లీహిల్స్‌లోని బూత్‌బంగ్లా ద‌గ్గ‌ర ఓ భారీ సెట్ వేసి చిత్రీక‌రిస్తున్నారు. యాక్ష‌న్ స‌న్నివేశాలను ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు. ఆప‌క్క‌నే గ‌ల ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ కూడా షూట్ జ‌రుగుతోంది. తొలిరోజు యాక్ష‌న్ పార్ట్ చేస్తున్నారు.

యాక్ష‌న్ చిత్రాలకు వినాయ‌క్ పేరు. అందుకే వీలుచూసుకుని ఆ ప‌క్క‌నే పుష్ప సెట్లో వున్న సుకుమార్ నిక్క‌ర్‌తో వ‌చ్చి వినాయ‌క్‌ స‌ల‌హాలు తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఆ సెట్లో చాలాసేపు సుకుమార్ వున్నారు. యాక్ష‌న్ సీన్ల‌ను చూసి వెళ్ళారు. వీరిద్ద‌రు యాక్ష‌న్ పార్ట్ ఒకేసారి మొద‌లు పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
 
ఇక పుష్ప‌ సినిమాను ఆగ‌స్ట్ 13న పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు భావించారు. అయితే కొవిడ్ ప్రభావంతో షూటింగ్ జరగకపోవటంతో సినిమా రిలీజ్ డేట్ మారుతుంది. మరో 40 రోజులు చిత్రీకరణ చేయాల్సి ఉంది.మొదటి పార్ట్ ను చిత్రీక‌రించి సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ని తెలుస్తోంది. మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments