Webdunia - Bharat's app for daily news and videos

Install App

సితార ఘట్టమనేని బుగ్గపై ముద్దెట్టుకున్నదెవరు?

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (13:41 IST)
సితార ఘట్టమనేని తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె. సినిమాల్లోకి రాకపోయినా ఆమెకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ వుంది. ఇప్పటికే ఓ కమర్షియల్ యాడ్‌లో నటించి అందరినీ ఆకట్టుకుంది. తన తండ్రిలానే ఆమె కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి సహాయం చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 
 
11 ఏళ్లకే ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ, కష్టపడి పనిచేస్తూ, మంచి పనులకు సపోర్ట్ చేస్తూ సితార అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వారసురాలిగా సితారకు మంచి గుర్తింపు వచ్చింది. 
 
ఇంత చిన్న వయసులో అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ఇప్పటికే పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వేడుకలకు కూడా హాజరవుతోంది. 
 
తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థల్లో ఒకటైన మ్యాక్స్‌ అతిపెద్ద స్థాయి బొమ్మలను ఏర్పాటు చేసింది. మాక్స్ కంపెనీ దసరా సందర్భంగా వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులను అతి తక్కువ ధరలకు వినియోగదారులకు విక్రయించేందుకు ఈ సేల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ మాల్‌లో దీన్ని ఏర్పాటు చేశారు.
 
అలాగే బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వచ్ఛంద సంస్థల ద్వారా వృద్ధులు, అనాథ పిల్లలకు బహుమతులు అందజేశారు. వేదికపై ఉన్న వారందరికీ సితార బహుమతులు ఇచ్చి వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా ఓ అవ్వ సితార బుగ్గపై ముద్దుపెట్టుకుంది. సితార కూడా ఆ వృద్ధురాలిని చూసి ఆప్యాయంగా నవ్వింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments