Sudhir Babu, Harshavardhan, Puskur Ram Mohan
సుధీర్ బాబు, యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామ మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. “#మామా మశ్చీంద్ర ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ట్రైలర్ బ్లాస్ట్ గా ఉంది! సుధీర్ బాబు, టీమ్‌కి ఆల్ ది బెస్ట్'' తెలియజేశారు మహేష్ బాబు.
పరశురామ్ పాత్ర (సుధీర్ బాబు)ని పరిచయం చేసే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. పరశురాంకి మిర్నాళిని రవి, ఈషా రెబ్బా ఇద్దరు కుమార్తెలు. వారు పరశురామ్ సోదరి కొడుకులైన కవలలు డిజే, దుర్గాలతో ప్రేమలో పడతారు. తనపై పగ తీర్చుకునేందుకు డీజే, దుర్గా తన కూతుళ్లతో లవ్ గేమ్ ఆడుతున్నారని పరశురాం అనుమానపడతాడు. ట్రైలర్ సూచించినట్లుగా హర్షవర్ధన్ ఒక యునిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో ముందుకు వచ్చారు. మూడు పాత్రలను విలక్షణంగా చూపించాడు. పరశురామ్ క్రూరమైన నేరస్థుడు. డిజే ప్లేబాయ్. దుర్గ ఒక లావుపాటి వ్యక్తి. ఈ మూడు పాత్రల్లో సుధీర్ బాబు అద్భుతంగా నటించారు. మిర్నాళిని రవి, ఈషా రెబ్బా గ్లామర్‌గా కనిపించారు. హర్షవర్ధన్ కూడా కీలక పాత్ర పోషించారు. పీజీ విందా సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్ అసెట్. ఈ చిత్రానికి రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌కి చెందిన సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. మామా మశ్చీంద్ర అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ముందుగా నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారికి పాదభివందనాలు.'మామా మశ్చీంద్ర' అక్టోబర్ 6న విడుదలౌతుంది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ గారి ధన్యవాదాలు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమా నిర్మాతలకు మంచి రిటర్న్స్ ఇస్తుందనే నమ్మకం వుంది. హర్ష రైటింగ్ కి నేను అభిమానిని. తనకిక్రాఫ్ట్ మీద చాలా పట్టుంది. తప్పకుండా తను టాప్ డైరెక్టర్ అవుతారు. మనం చూసినప్పుడు అరుదైన సినిమాగా ఎలా ఫీలయ్యారో ఈ సినిమా చుసిన్నపుడు కూడా ఆలాంటి అరుదైన అనుభూతి కలుగుతుంది. పీజీ విందా, మార్తండ్ కే వెంకటేష్ గారు, చేతన్ భరద్వాజ్ .అందరూ బ్రిలియంట్ గా వర్క్ చేశారు. ఇందులో నాది ట్రిపుల్ రోల్. పరశురాం, దుర్గ, డిజే గా కనిపిస్తా. నాకు తొమ్మిదేళ్ళు వున్నప్పుడు ఆ వయసులో మా అబ్బాయి కనిపిస్తాడు. ఇందులో పరశురాం పాత్రకు బరువు కూడా పెరిగాను. లావుగా వున్న దుర్గా పాత్రకు ప్రోస్తటిక్స్ వాడం. ఇంకొకటి డిజే నా రెగ్యులర్ వెయిట్ లో వుంటుంది . నా కెరీర్ లో చాలా వైవిధ్యమైన సినిమా ఇది. ఇందులో పాత్రలకు అందరూ కనెక్ట్ అవుతారు. కంటెంట్ వున్న కమర్షియల్ సినిమా ఇది. ఇందులో అన్ని ఎలిమెంట్స్, జోనర్స్ వుంటాయి. ఇషా రెబ్బా, మృణాలిని చక్కగా చేశారు. అక్టోబర్ 6న తప్పకుండా థియేటర్స్ లో చూడండి. కొత్తరకం కథ కొత్తగా తీశారని ఫీలౌతారు'' అన్నారు
దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. మామా మశ్చీంద్ర నా జీవితంలో విడుదల కాబితున్న మొట్టమొదటి సినిమా. పాతికేళ్ళుగా ఈ టర్నింగ్ పాయింట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితిలో ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. చాలా ఖర్చు చేసిన థియేటర్ కి వచ్చిన తర్వాత వాళ్లకి నచ్చిన కంటెంట్ ఇవ్వకపొతే చాలా ఫీలౌతారు. నాపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఒక భాద్యతగా భావించి వాళ్ళు వున్నారనే ధైర్యంతో దర్శకత్వం చేశాను. ఇందులో ప్రతి సన్నివేశంలో ఒక మలుపు, సర్ప్రైజ్ వుంటుంది. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది. ఇది మన అందరి కథ. 'మనం' రచయితగా మీ అందరి ప్రేమ అభిమానం పొందాను. ఇంతకాలం గ్యాప్ తీసుకొని చేయడానికి కారణం మీ నమ్మకాన్ని వొమ్ము చేసి అలోచనే లేదు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సుధీర్ బాబు గారుఎంతగానో ప్రోత్సహించారు. అలాగే నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఎంతో సపోర్ట్ చేశారు. మేము అనుకున్న అవుట్ పుట్ వచ్చింది. టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు'' తెలిపారు.
నిర్మాత పుస్కుర్ రామ్ మోహన్ మాట్లాడుతూ.. 'మామా మశ్చీంద్ర' చాలా డిఫరెంట్ మూవీ. ప్రతి పదిహేను నిమిషాలు ఒక మలుపు,సర్ప్రైజ్ వస్తుంది. హర్ష వర్ధన్ గారు ఒక సవాల్ గా తీసుకొని ఈ సినిమాని అద్భుతంగా మలిచారు. మామా అల్లుళ్ళ మధ్య వచ్చే మలుపు ఇదివరకూ ఎన్నడూరాని విధంగా వుంటాయి. అక్టోబర్ 6న సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్స్ లో చూడాలి. తప్పకుండా సరికొత్త అనుభూతిని ఇస్తుంది'' అన్నారు.