నల్గొండలో వైఎస్ షర్మిల దీక్ష: ప్రతి మంగళవారం నిరాహార దీక్ష

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (16:34 IST)
నల్గొండలో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. నల్గొండ కేంద్రంలోని క్లాక్​టవర్​ వద్ద వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల.. నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
తొలుత మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వద్ద మాట్లాడిన అనంతరం ... నిరాహారదీక్ష వేదికకు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ప్రతి మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష వారం చేపడతానని షర్మిల వనపర్తి జిల్లా తాడిపత్రి పర్యటనలో చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ పర్యటనలో తెలిపారు. వాటిని భర్తీ చేయాలనే డిమాండ్​తో ప్రతివారం ఒక్కో జిల్లాలో దీక్ష చేపడుతున్నారు. 
 
ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ దీక్ష చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ వారం నల్గొండ కేంద్రంలో దీక్ష చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CAT మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

అకీరా నందన్‌కు ఊరట... ఏఐ లవ్ స్టోరీపై తాత్కాలిక నిషేధం

డా. ఎం. మోహన్ బాబు కు బెంగాల్ ప్రభుత్వ గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డు

ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ పనులు ప్రారంభం, త్వరలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ

పవన్ కళ్యాణ్ తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం : నటి భూమిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments