Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేడిపల్లిలో వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు

మేడిపల్లిలో వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు
, మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (14:46 IST)
వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మేడిపల్లి వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, మంగళవారం నాటి దీక్షకు ఆమెకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 
 
అయినప్పటికీ ఆమె దీక్షకు యత్నించారు. దీంతో బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉదయం ఉద్రిక్తత నెలకొంది. మొదటగా ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. 
 
అనుమతి నిరాకరించినా నగరంలోని బోడుప్పల్‌లో దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకూ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి తరలివచ్చారు.
 
తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే.. ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించేందుకు తర్వాత ఆమె మేడిపల్లి పీఎస్‌కు బయలుదేరారు. అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో షర్మిల, ఆమె పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 
 
దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. విషయం తెలియడంతో మేడిపల్లి పీఎస్‌కు  వైఎస్సార్ టీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. దీంతో షర్మిలను పోలీసులు ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వందల మంది నిరుద్యోగులను పొట్టనపెట్టుకున్న హంతకుడు కేసీఆర్ అని... షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే.. తమ దీక్షకు అనుమతి ఇవ్వలేదని ఆమె ధ్వజమెత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరుద్యోగులకు శుభవార్త.. భారతీయ రైల్వేలో 492 ఉద్యోగాలు