Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిరుద్యోగులకు శుభవార్త.. భారతీయ రైల్వేలో 492 ఉద్యోగాలు

Advertiesment
Indian Railway Recruitment 2021
కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రైల్వే అనుబంధ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీ సంస్థ అయిన చిత్తరంజన్‌ లోకోమోటివ్​ వర్క్స్​లో 492 అప్రెంటీస్​ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది.

కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే అప్రెంటీస్​ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపింది. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదని రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​ స్పష్టం చేసింది. 
 
ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 3లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అర్హత, దరఖాస్తు విధానం, ఫీజు వంటి అన్ని వివరాల కోసం www.apprenticeshipindia.org వెబ్​సైట్​ను సందర్శించాలని అభ్యర్థులను కోరింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, పెయింటర్, ఎసి మెకానిక్ వంటి ఐటీఐ విభాగాల్లో ఖాళీలున్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 2021 సెప్టెంబర్ 15 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపింది. అయితే, రిజర్వేషన్​ నిబంధనల ప్రకారం ఆయా అభ్యర్థులకు గరిష్ట వయో సడలింపు ఉంటుంది. 
 
అర్హత విషయానికి వస్తే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాక, సంబంధిత ట్రేడ్​ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి.. శిష్యుడు అరెస్టు