Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిరుద్యోగులకు హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ శుభవార్త

Advertiesment
HAL Recruitment 2021
హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నాసిక్ డివిజన్లో పలు అప్రంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 475 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 
 
ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్ ట్రైనీలుగా పని చేయాల్సి ఉంటుంది. అర్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఉపకార వేతనం చెల్లించనున్నారు. ట్రైనింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు సొంతంగానే వసతి, ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
 
ఫిట్లర్ విభాగంలో ఐటీఐ చేసిన వారి కోసం 210 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా అప్రంటీస్ పోర్టల్ www.apprenticeshipindia.orgలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారిక వెబ్ సైట్లో సూచించిన విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 13లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉలుందూరు పేట లో శ్రీవారి ఆలయ నిర్మాణం వైభవంగా భూమి పూజ