వరల్డ్ ఎగ్ డే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన కాకి కథ.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (13:22 IST)
crow
శుక్రవారం వరల్డ్ ఎగ్ డే. గుడ్డులో ఉన్న పోషకాలు, వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఈ గుడ్డు దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజున వరల్డ్ ఎగ్ డేకు సంబంధించిన ఆరోగ్య వార్తలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ కాకి ఆకలి తీర్చుకోవడానికి కోడిగుడ్లను ఎలా ఆహారంగా తీసుకుందో తెలిస్తే.. షాక్ అవుతారు. 
 
దుకాణం ముందు అమ్మకానికి ఉంచిన కోడిగుడ్ల ట్రేను గమనించిన కాని.. అందులోని గుడ్లను పగలగొట్టి అందులోని సొనను తాగింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ దుకాణం వద్ద అమ్మకానికి బయట ఉంచిన కోడిగుడ్ల ట్రేలో గుడ్లను గమనించిన ఓ కాకి తన ఆకలి తీర్చుకోవడం కోసం అటూ ఇటూ వాలుతూ సరిగ్గా ఆ గుడ్ల ట్రే పైకి వచ్చివాలింది. 
 
ముందుకు వెనుకకు కదులుతూ తనను ఎవరైనా గమనిస్తున్నారా లేదా అని అటూ ఇటూ చూసుకుంది. ఆ తర్వాత ముక్కుతో గుడ్లను పోడిచి అందులోని సొనను తిని ఆకలి తీర్చుకుంది. ఇలా సుమారు ఏడు ఎనిమిది గుడ్లను పగులగొట్టింది.
 
కాకి ఆకలి తీర్చుకుంటున్న తీరును గమనించి ఆ గుడ్ల వ్యాపారి దాన్ని ఏమనకుండా అలాగే మిన్నకుండిపోయాడు కొద్దిసేపు అక్కడ తన ఆకలిని తీర్చుకునేందుకు ఆ కాకి చేసిన సందడితో స్థానికులు కూడా విస్మయం చెందారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments