Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడుతో మహిళా ఎస్.ఐ రాసలీల... భర్త పట్టుకున్నాడనీ...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (19:13 IST)
ఆమె కాబోయే మహిళా ఎస్.ఐ. వరసకు అల్లుడైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తనే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులకు అడ్డంగా బుకైపోయింది. వివరాల్లోకి వెళితే రైల్వేలో పనిచేస్తున్న శ్రీనివాస్ మృతి చెందడంతో శ్రీనివాస్ భార్య సంగీతపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు శ్రీనివాస్ సోదరులు సురేష్, శంకర్. దీంతో రంగంలోకి దిగిన క్లూస్ టీం శ్రీనివాస్ భార్య సంగీతను అదుపులోకి తీసుకుని విచారించారు నాంపల్లి రైల్వే పోలీసులు. 
 
ఈ విచారణలో ఘోరమైన నిజాలు బయటపడ్డాయి. భర్తను తనే హత్య చేసినట్లు అంగీకరించింది సంగీత. తన అల్లుడు విజయ్ సహాయంతో చాపలో చుట్టి బోరబండ రైల్వే ట్రాక్ పక్కన పడేసినట్టు తెలియజేసింది. కేసును దర్యాప్తు చేసిన రైల్వే పోలీసులు హత్యగా తేలడంతో సంగీత అల్లుడు విజయ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బిఇడి చదివిన సంగీత ఇటీవల జరిగిన ఎస్సై పరీక్షల్లో సెలక్షన్ ఎస్సైగా క్వాలిఫై అయింది.
 
మరికొద్ది రోజుల్లో పోస్టింగ్ కూడా రావాల్సి ఉంది. శ్రీనివాస్‌కు స్వయానా అక్క కొడుకైన విజయ్ రెండు సంవత్సరాల క్రితం శ్రీనివాస్ ఇంట్లో ఉండేవాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ భార్య సంగీతతో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్, భార్యను తీవ్రంగా మందలించి విజయ్‌ను ఇంటి నుంచి పంపించేశాడు. ఇదే విషయంపై తరచూ గొడవలు పడుతుండేవారు ఈ భార్యభర్తలు. 
 
సంగీత ప్రవర్తనతో విసుగు చెందిన శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం నాడు సాయంకాలం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగడంతో  అర్థరాత్రి భర్తను చంపేయాలని నిర్ణయించుకున్న భార్య సంగీత సాయంకాలం ఆరు గంటల సమయంలో ప్రియుడు విజయ్‌కి ఫోన్ చేసి పిలిపించింది.

రాత్రి పదకొండున్నర సమయంలో రైల్వే క్వార్టర్ వెనుక నుండి ఇంట్లోకి ప్రవేశించాడు విజయ్ శ్రీనివాస్ మద్యం సేవించి నిద్రిస్తున్న సమయంలో భార్య సంగీత సహాయంతో శ్రీనివాస్ తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు శ్రీనివాస్. కాబోయే పోలీస్ అధికారిణి ఇటువంటి కేసులో ఇరుక్కోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan & Alluarjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments