Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై లైంగిక వేధింపులు: ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (11:02 IST)
ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆయాకు కఠిన శిక్షణ విధించింది బాలమిత్ర కోర్టు. 2017 లో హైదరాబాద్ పాతబస్తీలో ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న తొమ్మిదేళ్ళ బాలుడిని అదే స్కూల్‌లో ఆయాగా పనిచేస్తున్న 25ఏళ్ల యువతి లైంగికంగా వేధించింది. 
 
దాంతో ఆ బాలుడు తల్లితండ్రులకు ఫిర్యాదు చేశాడు. తల్లి దండ్రులు ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయాను విచారించారు.
 
తగిన ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. కాగా తాజాగా ఈ కేసులో బాలమిత్ర కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ సదరు యువతికి ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అదేవిధంగా 10 వేలు జరిమానా కూడా విధించింది. ఇక ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. మహిళలపై నే కాకుండా పురుషుల పై కూడా లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చట్టాలు అమలు చేస్తారని ఈ కేసుతో అర్థం అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం