ఆర్టీసీ బస్సులో మహిళా కానిస్టేబుల్, కండక్టర్‌ల మధ్య ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూనిఫామ్‌లో ఉంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని మహిళ పోలీస్ కానిస్టేబుల్, టికెట్ తీసుకోవాల్సిందేనన
ఆర్టీసీ బస్సులో మహిళా కానిస్టేబుల్, కండక్టర్‌ల మధ్య ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూనిఫామ్‌లో ఉంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని మహిళ పోలీస్ కానిస్టేబుల్, టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ వాదించడంతో ఘర్షణకు దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే... మహబూబ్ నగర్ నుంచి నవాబుపేటకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ రజితకుమారి ఎక్కారు.
ఆ బస్సుకి కండక్టర్‌గా పనిచేస్తున్న శోభారాణి.. కానిస్టేబుల్‌ను కూడా టికెట్ తీసుకోమంది. కానీ కానిస్టేబుల్ అందుకు నిరాకరించింది. తాను డ్యూటీలో వున్నానని చెప్పింది. తన వద్దనున్న జిరాక్స్ ఐడీ కార్డు చూపించారు. అయితే దానిని అనుమతించమని, ఒరిజినల్ చూపించాలని కండక్టర్ డిమాండ్ చేశారు.
దీంతో వారి మధ్య ఏర్పడిన వాగ్వివాదం.. ఘర్షణకు దారితీసింది. దీంతో కానిస్టేబుల్ ఆవేశంతో కండెక్టర్‌పై చేజేసుకుంది. దీనిని ఓ ప్రయాణీకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. మీరూ చూడండి..