క్లాస్‌రూమ్‌లో ఒకటే మాటలు.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. క్లాస్‌రూమ్‌లో తోటి విద్యార్థులతో మాట్లాడిన పాపానికి ఓ టీచర్ విద్యార్ధి చెయ్యి విరగ్గొట్టేసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌ల

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (11:33 IST)
ఉత్తరప్రదేశ్ పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. క్లాస్‌రూమ్‌లో తోటి విద్యార్థులతో మాట్లాడిన పాపానికి ఓ టీచర్ విద్యార్ధి చెయ్యి విరగ్గొట్టేసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌లోని స్టెప్పింగ్ స్టోన్స్ పాఠశాలలో నిధి అనే పేరుగల టీచర్ సైన్స్ పాఠాలు బోధిస్తున్నారు. 
 
క్లాస్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు తోటి విద్యార్థులతో మాట్లాడుతూనే వున్నారు. ఓ విదార్ధిని పిలిచి చెక్క డస్టర్‌తో చేతిపై పలుమార్లు తీవ్రంగా కొట్టారు. తన చెయ్యి అప్పటికే బలహీనంగా ఉందనీ... కొట్టడం ఆపేయాలంటూ సదరు విద్యార్థి వేడుకున్నా టీచర్ మాత్రం కనికరించలేదు. 
 
విద్యార్ధి చేతి మణికట్టు విరిగిపోయేదాకా కొడుతూనే ఉండటంతో విలవిల్లాడిపోయిన పిల్లాడు స్కూల్ వాచ్‌మెన్ సాయంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి గాయం గురించి సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు టీచర్‌తో పాటు స్కూల్ ప్రిన్సిపల్‌పై పోలీసు కేసు పెట్టారు.
 
తొలుత తాను పిల్లాడిని కొట్టనేలేదని బుకాయించిన టీచర్... సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించడంతో నేరాన్ని అంగీకరించారు. దీనిపై స్పందించిన స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను ఉద్యోగంలో నుంచి తీసేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments