Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా చావుతో మీ అమ్మానాన్నలు సంతోషంగా ఉంటారు.. వివాహిత సూసైడ్ నోట్

"మా చావుతో మీ అమ్మానాన్నలు సంతోషంగా ఉంటారు. మా ఇద్దరి మృతదేహాలకు ఉలిపెరలో అంత్యక్రియలు జరిపితే మా ఆత్మలు ప్రశాంతంగా ఉండవు" అంటూ ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసిపెట్టి తన బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. నాగర

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (15:50 IST)
"మా చావుతో మీ అమ్మానాన్నలు సంతోషంగా ఉంటారు. మా ఇద్దరి మృతదేహాలకు ఉలిపెరలో అంత్యక్రియలు జరిపితే మా ఆత్మలు ప్రశాంతంగా ఉండవు" అంటూ ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసిపెట్టి తన బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఈ విషాదం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని వంగూరు మండలం ఉలిపెర గ్రామానికి చెందిన నరేందర్‌కు మిడ్జిల్‌కు చెందిన శ్వేత(26)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉన్నారు. నాగర్‌కర్నూల్‌లోని విద్యానగర్‌లో తిరుమల రెడిమేడ్‌ డ్రస్సెస్‌ దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని దాని ఎదురుగా ఉన్న కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు. వారికి సంజయ్‌ అనే మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. అత్తమామలతో మాటామాట పెరిగి మనస్పర్థలకు దారితీసినట్లు తెలిసింది. ప్రతి రోజూ అత్తమామల తీరుతో ఆమె విసిగిపోయింది. దీంతో ఇక జీవించకూడదని నిర్ణయించుకుంది. 
 
ఈ నేపథ్యంలో దసరా సీజన్‌ కావడంతో హోల్‌సేల్‌లో రెడిమేడ్‌ డ్రస్సులను కొనుగోలు చేయడానికి భర్త నరేందర్‌ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్వేత కుమారుడు సంజయ్‌ను బెడ్‌రూమ్‌‌లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసి బాలుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తాను కూడా పక్కనే ఉన్న ఇనుపచువ్వకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి పరిశీలించగా, ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో ‘‘మా చావుతో మీ అమ్మానాన్నలు సంతోషంగా ఉంటారు. మా ఇద్దరి మృతదేహాలకు ఉలిపెరలో అంత్యక్రియలు జరిపితే మా ఆత్మలు ప్రశాంతంగా ఉండవు’’ అంటూ శ్వేత ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments