Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యపేటలో దారుణం : ప్రయాణికురాలిపై బస్సుడ్రైవర్ అత్యాచారం

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (09:04 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో దారుణం జరిగింది. ఓ ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేట సమీపంలో ఈ ఘటన జరుగగా, కూకట్‌పల్లి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 29 యేళ్ల యువతి ఒకరు హైదరాబాద్ నగరంలో బేబీ కేరే టేకర్‌గా పని చేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి మాదాపూర్‌లో ఉంటుండగా, ఆమె భర్త వేరుగా నివసిస్తున్నాడు. 
 
అయితే, తన సొంతూరుకు వెళ్లేందుకు ఈ నెల 23వ తేదీన ఓ ప్రైవేటు స్లీపర్ క్లాస్ బస్సు ఎక్కి, తనకు కేటాయించిన సీటులో నిద్రకు ఉపక్రమించింది. బస్సు కదిలిన తర్వాత అర్థరాత్రి 12.30 గంటల సమయంలో బస్సు సూర్యాపేట దాటింది. 
 
ఈ బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లలో రాజేష్ (35) అనే బస్సు డ్రైవర్ ఈ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మరో బస్సు డ్రైవర్ బెదిరించి ఆమె వద్ద ఉన్న రూ.7 వేల నగదును దోచుకున్నాడు. 
 
ఆ తర్వాత బాధితురాలు శనివారం హైదరాబాద్ నగరానికి చేరుకుని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒక నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments