Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకసలే కరోనా... ఆస్తి పత్రాలు ఇస్తావా.. ముఖంపై దగ్గమంటావా?

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (08:08 IST)
తన మాట వినని ఓ భర్తను భార్య తనదైనశైలిలో దారికితెచ్చుకుంది. గత కొంతకాలంగా తనను వేధిస్తున్న భర్తకు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. నాకసలే కరోనా వైరస్ సోకివుంది. ఆస్తి పత్రాలు ఇస్తావా లేదా ముఖంపై దగ్గమంటావా అంటూ నిలదీసింది. దీంతో భర్త... భార్య చెప్పినట్టు నడుచుకున్నాడు. 
 
ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నందగిరిహిల్స్‌లో నివసించే వ్యాపారవేత్త సంజీవరెడ్డి (70) గతంలో ఓ మహిళ (38)ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో మహిళ పేరిట ప్రశాసన్‌నగర్‌లో సంజీవరెడ్డి ఇంటిని కొనుగోలు చేశాడు.
 
అయితే, ఆ తర్వాత ఆ మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిగా ఉంటుంటుండగా, తండ్రి, కుమారులిద్దరూ నందగిరిహిల్స్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాసన్‌నగర్‌లో కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని గత నెల 31న తన మాజీ భర్త ఇంటికి వెళ్లింది. 
 
తన పేరిట ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నీ ఇష్టం మరి.. నాకసలే కరోనా సోకింది, మర్యాదగా ఆస్తిపత్రాలు ఇచ్చేస్తే వెళ్లిపోతా. అప్పటికీ ఆయన నిరాకరించాడు. దీంతో మాజీ భర్తను దుర్భాషలాడడమేకాక, తనకు కరోనా సోకిందని, పత్రాలు ఇవ్వకుంటే ముఖంపై దగ్గుతానని బెదిరించింది. సంజీవరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో డ్రింకర్ సాయి అప్రిషియేషన్ : నిర్మాత బసవరాజు

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments