వేధింపుల కేసుపెట్టిన భార్య - ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:44 IST)
ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఎక్కువైపోతున్నాయి. దీంతో ఒకరిని ఒకరు వేధించుకుంటున్నారు. తద్వారా తమ పచ్చని కాపురంలో నిప్పు రాజేసుకుంటున్నారు. తాజాగా పోలీస్ కానిస్టేబుల్ భార్య భర్తపై వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆ కానిస్టేబుల్ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో టీఎస్‌పీఎస్‌సీ కానిస్టేబుల్‌‌గా రాంబాబు అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈయన కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్న రాంబాబుపై ఆయన భార్య వేధింపుల కేసు పెట్టింది.
 
ఒక యేడాది కాలంగా విధులకు వెళ్లకుండా తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలో మనస్తాపంతోనే రాంబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments