తెలంగాణాలో తెరాసను బొంద పెట్టేవరకు నిద్రపోం : ఎంపీ అరవింద్

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (16:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీని చిత్తుగా ఓడించేంత వరకు విశ్రమించేది లేదని బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ, రాష్ట్రంలో దొంగ పాస్ పోర్టుల వ్యవహారం హిందువులను ఆందోళ‌న‌ల‌కు గురిచేస్తోంద‌న్నారు. 
 
రోహింగ్యాల పాస్ పోర్టు జారీకి నైతిక బాధ్యత వహిస్తూ పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని ఆయ‌న అన్నారు. ముస్లింల ఓట్ల శాతాన్ని పెంచేందుకే నిజామాబాద్ సీపీ కార్తికేయకు పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఆయ‌న‌కు మ‌రో చోటకు పదోన్నతి వచ్చినప్ప‌టికీ కార్తికేయ నిజామాబాద్ జిల్లాను వదలడం లేదని చెప్పారు. 
 
కాగా, తెలంగాణ కాంగ్రెస్‌లో కేసీఆర్ చెప్పినవాళ్లకే పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆ రెండు పార్టీల‌కు మ‌ధ్య సంబంధం ఉంద‌ని చెప్పుకొచ్చారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన అడ్వకేట్ వామన్ రావు దంప‌తుల‌ హత్యను ఖండిస్తున్నామ‌ని తెలిపారు.
 
ఇదిలావుంటే, తెలంగాణాలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల హత్యపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. మృతుడు వామన్​రావు తండ్రి కిషన్​రావు ఫిర్యాదుతో ముగ్గురిపై కుట్ర, హత్య అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 
 
వామన్​రావు దంపతుల హత్య కేసులో పోలీసులు.. ఏ1గా వెల్ది వసంతరావు, ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా అక్కపాక కుమార్​ను చేర్చారు. ఐపీసీ 120బి, 302, 341, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 
 
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద బుధవారం రోజు వామన్​రావు దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన విషయం లిసిందే. హైదరాబాద్ నుంచి కల్వచర్ల చేరుకున్న క్లూస్ టీం వివరాలు సేకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments