Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సినిమా చూపిస్త మావా' అంటూ చిందేసిన కలెక్టర్ అమ్రపాలి... కరీంనగర్ వెళ్తానంటున్నారా?(వీడియో)

అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం అనగానే ఆ చిత్రంలో మావ ప్రకాష్ రాజ్ కు శ్రుతి హాసన్ తో కలిసి సినిమా చూపిస్త మావా అంటూ అల్లు అర్జున్ కేకపెట్టించే పాట గుర్తుకు వస్తుంది. ఈ పాట అప్పట్లో ఎక్కడ చూసినా సౌండ్ బాక్సులను బద్ధలు చేసేది. ఆ పాటను అప్పట్లో ఖమ్మం జ

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (16:47 IST)
అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం అనగానే ఆ చిత్రంలో మావ ప్రకాష్ రాజ్ కు శ్రుతి హాసన్ తో కలిసి సినిమా చూపిస్త మావా అంటూ అల్లు అర్జున్ కేకపెట్టించే పాట గుర్తుకు వస్తుంది. ఈ పాట అప్పట్లో ఎక్కడ చూసినా సౌండ్ బాక్సులను బద్ధలు చేసేది. ఆ పాటను అప్పట్లో ఖమ్మం జిల్లాలో ఓ కార్యక్రమంలో ప్లే చేశారు. ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ప్రస్తుత వరంగల్ కలెక్టర్ అమ్రపాలి చక్కగా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. అది అప్పటిమాట.
 
ఇక ఇప్పటి మాట ఏంటయా అంటే... వరంగల్ జిల్లాలో పొలిటికల్ లీడర్లకు కలెక్టరు ఆమ్రపాలికి మధ్య కొన్ని విషయాల్లో తేడాలు వస్తున్నాయట. ఆమె ప్రజల కోసం ఏదయినా చేయబోతుంటే నాయకులు మోకాలడ్డుతూ విసిగిస్తున్నారట. దీనితో ఆమెకు విసుగొచ్చి తను కరీంనగర్ జిల్లాకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఐతే పొలిటికల్ నాయకులు మాత్రం కలెక్టర్ ఆమ్రపాలికి సోషల్ మీడియాపై వున్నంత యాక్టివ్ పనుల్లో లేదని విమర్శిస్తున్నారట. ఇది మామూలే... కిట్టనివారు ఇలాగే చెప్పేస్తుంటారు. మరి కలెక్టర్ ఆమ్రపాలి జిల్లాలోనే వుండి సాధిస్తారా.. లేదంటే కరీంనగర్ వెళతారా చూడాలి. సరే ఇక్కడ ఓ కార్యక్రమంలో ఆమ్రపాలితో పాటు మిగిలిన అధికారుల స్టెప్పులు చూద్దాం ఈ వీడియోలో...

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments