Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న వారిపై మిద్దె కూలడంతో ఆరుగురు మృతి..

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (09:59 IST)
తెలంగాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న వారిపై మిద్దె కూలడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద ఘ‌ట‌న తెలంగాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా అయిజ మండ‌లంలో చోటు చేటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కొత్త‌ప‌ల్లి గ్రామంలో మోష, శాంత‌మ్మ దంప‌తులు నివసిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం. ప్ర‌తిరోజు లాగాగే శ‌నివారం రాత్రి భోజ‌నం అనంత‌రం ఆ కుటుంబం నిద్ర‌పోయింది. అయితే.. ఆదివారం తెల్ల‌వారుజూమున మిద్దె కూలీ వారిపై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో భార్య భ‌ర్త‌ల‌తో పాటు ముగ్గురు పిల్ల‌లు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
 
స్పందించిన స్థానికులు క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుంగా.. మ‌రొకరు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఒక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా.. మ‌ట్టి మిద్దె కూలిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments