Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

‘మా’ సభ్యత్వానికి సీవీఎల్‌ రాజీనామా

Advertiesment
CVL
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (23:03 IST)
‘మా’ అధ్యక్ష పోటీకి నామినేషన్‌ వేసి ఉపసంహరించుకున్న నటుడు సీవీఎల్‌ నరసింహరావు శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు తెలిపిన ఆయన, కొద్దిేసపటికే ‘మా’ సభ్యత్వానికి ‘భాజాపా సినిమా సెల్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

‘మా’ ఎన్నికలు అనే పరీక్ష రాయకముందే ఫెయిల్‌ అయ్యానని అన్నారు. ‘దివంగత నటుడు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దర్శకుడు దాసరి నారాయణరావు.. అందరి ఆశీస్సులు ఉన్నాయి. కచ్చితంగా ఈ ఎన్నికలు హాయిగా ముందుకు సాగుతాయి. ఒకవేళ అలా జరగకపోతే ‘మా’కి రాజీనామా చేస్తా. ఇందులో సభ్యుడిగా కొనసాగను.

ఇలాంటి గందరగోళ, దరిద్రమైన పరిస్థితులకి నేనూ దోహదం చేశాను కాబట్టి ఇకపై ఓటు వేయను. బురదలో ఉన్నా వికసించడానికి నేను కమలాన్ని కాదు’ అని అన్నారు. ఆ కాేసపటికే రాజీనామా చేశారు.

ఎన్నికలకు రెండ్రోజుల ముందు సీవీఎల్‌ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆసక్తి నెలకొంది.  ఈ నెల 10న మా ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెల్లడవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లి కనిపించట్లేదు... తిండి మానేసిన ఫ్యామిలీ.. స్కూలుకు వెళ్లని కిడ్స్ ఎక్కడ?