Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాస్‌లు సీరియస్ అవుతున్నారనీ... పోలీస్ స్టేషన్‌ గోడ కూల్చారు.. వాస్తు కోసమట...

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (20:45 IST)
హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ పోలీసుస్టేషన్ గోడను పోలీసులు కూల్చేశారు. వాస్తు దోషం ఉందని భావించిన పోలీసులు గోడను కూలుస్తున్నట్టు సమాచారం. ఎస్.ఆర్. నగర్ పోలీసుల పనితీరుపై విమర్శలు రావడం.. ఇక్కడ పనిచేసే అధికారులపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉండటంతో ఇదంతా వాస్తుదోషమేనని.. గ్రహాలు అనుకూలంగా లేకపోవడమే కారణమని భావించి.. గోడను కూల్చితే అంతా మంచి జరుగుతుందని.. ఈ పని చేసినట్టు భావిస్తున్నారు. 
 
గతంలో ఎస్.ఆర్. నగర్ పోలీసులు ఓ వైన్ షాప్ వద్ద పోలీసు వ్యానుని నిలిపి.. మద్యం బాటిళ్లు పట్టుకెళ్లడంతో పాటు.. పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయ్.. దాంతో గోడను కూల్చి.. ప్రవేశ ద్వారాన్ని మార్చితే మంచి జరుగుతుందని భావిస్తున్నారు పోలీసులు. 
 
గోడను కూల్చే పనులతో అటుగా వెళ్లే వాహనాలను వెళ్లనివ్వకుండా.. పోలీసు స్టేషన్ ముందు రోడ్డంతా బ్యారికేడ్లతో మూసేశారు. దాంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వాస్తుపీడ పోలీసులను వేధిస్తోందని.. శాంతి చేకూరాలనే ఇదంతా చేస్తున్నట్టు పోలీసువర్గాలు చెప్తున్నాయ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments