Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ యిష్టంతో నాకు పని లేదు.. నన్నే పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ కిడ్నాప్ చేశాడు.. వైశాలి

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (09:59 IST)
నీ ఇష్టంతో నాకు పనిలేదు.. నువ్వంటే నాకు ఇష్టం.. నువ్వు ఇంకెవర్నీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని బెదిరించిన నవీన్ రెడ్డి తనను కిడ్నాప్ చేశాడని దంత వైద్య విద్యార్థిని వైశాలి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
 
రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో పలు ఆసక్తికర విషయాలు పోలీసుల విచారణలో వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డికి, బాధితురాలి వైశాలికి వివాహం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైశాలి స్పందించారు. 
 
అతడితో తన పెళ్లి జరగలేదని స్పష్టం చేసింది. పైగా, అతడు పెళ్లి జరిగింది అని చెప్పిన రోజున తాను ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని వైశాలి వెల్లడించింది.
 
అతడితో తనకు బ్యాడ్మింటన్ ఆడే సమయంలో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తనకు ఇష్టంలేదని చెప్పి దూరం పెట్టానని తెలిపారు. కానీ, తమ ఫ్యామిలీ ఫ్రెండ్ బుచ్చిరెడ్డి ద్వారా తన తల్లిదండ్రులను సంప్రదించి పెళ్లి ప్రస్తావన చేయగా, తన తల్లిదండ్రులు కూడా అతడిని ఇష్టపడలేదని వైశాలి చెప్పింది.
 
ఆ తర్వాత తనను బెదిరించడం, వేధించడం మొదలు పెట్టాడని, పెళ్లి చేసుకోకపోతే తన జీవితం నాశనం చేస్తాని చెప్పి, ఇంటిపై దాడిచేసి బలవంతంగా లాక్కెళ్లాడని, కారులోనే తనను తీవ్రంగా కొట్టాడని బోరున విలపిస్తూ చెప్పింది. తాను చెప్పినట్టు వినకపోతే తన తండ్రిని చంపేస్తానని బెదిరించారని వైశాలి ఆరోపించారు. నీ యిష్టంతో నాకు పని లేదు.. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఇంకెవర్నీ పెళ్లి చేసుకోవాడనికి వీల్లేదు అని బెదిరించాడని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి దిల్ రూబా టైటిల్ ఖరారు

విజయ్ సేతుపతి, సూరి కాంబినేషన్ విడుదల 2 మూవీ రివ్యూ

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి సినిమాలో సోహైల్ ఖాన్ ఫస్ట్ లుక్

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వం ఆస్తుల ధ్వంసానికి కుట్ర : కాంగ్రెస్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments