Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ ఫొటోస్ దిగుతూ నీటిలో పడిన ఇద్దరు యువకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (07:46 IST)
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సోదరులిద్దరు సందర్శనకు వెళ్లారు. సెల్ఫీ ఫొటోస్ దిగుతూ ప్రమాదవశాత్తు తమ్ముడు నీటిలో పడిపోగా.. కాపాడేందుకు అన్న దూకాడు. వీరిలో అన్న గల్లంతు కాగా.. తమ్ముడిని పోలీసులు, నీటిపారుదల సిబ్బంది సురక్షితంగా కాపాడారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సోహైల్‌(25), మహ్మద్‌ సైఫ్‌ ఆదివారం సింగూరు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు మహ్మద్‌ సైఫ్‌ నీటిలోకి జారిపడ్డాడు. తమ్ముడిని రక్షించేందుకు నీళ్లలో దూకిన సోహైల్‌ గల్లంతయ్యాడు.

సైఫ్‌ ఈదుకుంటూ గేట్లవద్దకు చేరుకోవడంతో స్థానికులు, పుల్కల్‌ మండల పోలీసులు, నీటిపారుదలశాఖ సిబ్బంది తాడు సహాయంతో బయటికి లాగారు.

గల్లంతైన సోహైల్‌ ఆచూకీ కోసం మునిపల్లి, పుల్కల్‌ మండలాల పోలీసులు గత ఈతగాళ్లతో గాలించారు. ఆదివారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదని మునిపల్లి ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments