Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఇద్దరు వైద్యులకు కరోనా... వారిని కలిసిన వారికి ఆ ఆదేశాలు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (15:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రోజూ కరోనా కేసుల సంఖ్య నమోదవుతోంది. ఇప్పటివరకు మొత్తం 44 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఇద్దరు వైద్యులకు కూడా ఈ వైరస్ సోకింది. 
 
హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన 41 యేళ్ళ వైద్యుడుతో పాటు ఆయన భార్య(36)కూ కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈమె కూడా వైద్యురాలే కావడం గమనార్హం. అలాగే, కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈన ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. 
 
డాక్టర్లయినా భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
ఇదిలావుంటే, దేశరాజధాని ఢిల్లీలో బస్తీ దవాఖాన నడిపే ఓ డాక్టరుకు కరోనా సోకడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఆయన భార్యకు, టీనేజీ కూతురికి పరీక్షలు జరిపితే వారికీ పాజిటివ్ వచ్చింది. మరో వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్టు తేలింది. 
 
దాంతో ఆయన క్లినిక్‌ను సందర్శించిన సుమారు 900 మందిని క్వారంటైన్ చేశారు. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ ఈ సంగతి వెల్లడించారు. 14 రోజుల పాటు అనుమానితులకు క్వారంటైన్ కొనసాగుతుంది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ మహిళ మార్చి 12న ఆ బస్తీ దవాఖానాను సందర్శించడమే ఈ కరోనా గొలుసుకట్టు వ్యాప్తికి కారణమని తెలిసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments