Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేత్తడి హారికను తొలగించలేదట... ఉప్పల శ్రీనివాస్ గుప్తా

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (12:16 IST)
తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బిగ్‌బాస్ ఫేమ్‌, దేత్త‌డి హారిక‌గారే ఉంటార‌ని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ది సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త స్ప‌ష్టం చేశారు. హిమాయ‌త్ న‌గ‌ర్‌లోని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ‌ కార్యాల‌యంలో ఎం.డి మ‌నోహ‌ర్ రావుతో క‌లిసి ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ‌ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్త‌డి హారిక గారిని తొల‌గించార‌ని ప‌లు మీడియా చాన‌ళ్లలో వ‌స్తున్న వార్త‌లను ఆయ‌న ఖండించారు. దేత్త‌డి హారికను తొల‌గించార‌న్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. తెలంగాణ టూరిజానికి దేశంలోనే ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్. మంత్రులు కేటీఆర్, శ్రీ‌నివాస్ గౌడ్ నాయ‌క‌త్వంలో ముందుకు వెళుతున్నామ‌న్నారు. అందుకోస‌మే టూరిజాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌చారం చేస్తున్నామ‌న్నారు. 
 
ఈ నేప‌థ్యంలోనే దేత్త‌డి హారికను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ విష‌యంలో మంత్రులు, ఉన్న‌తాధికారుల‌ను సంప్ర‌దించే ముందుకు వెళ్లామ‌న్నారు. అయితే కొంద‌రు గిట్ట‌ని వాళ్లు దేత్త‌డి హారిక‌ను తొల‌గించిన‌ట్లు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని.. ఇలాంటివి న‌మ్మొద్ద‌న్నారు. తెలంగాణ టూరిజాన్ని నెంబ‌ర్ వ‌న్ చేసేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్త‌డి హారిక‌నే కొన‌సాగుతున్నార‌ని స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు శ్రీ‌నివాస్ గుప్త చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ దర్శకత్వంలో జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం

తెలుగులో టోవినో థామస్, త్రిష యాక్షన్ త్రిల్లర్ ఐడెంటిటీ

జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో నేను హర్ట్ అయ్యా, వదిలిపెట్టను: నటి మాధవీ లత

Chiranjeevi: డియర్ తమన్ నీ మాటలు హృదయాన్ని తాకేలా వున్నాయ్: చిరంజీవి

అభిమాని కుటుంబంలో వెలుగునింపిన రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments