తెలంగాణాలో అన్ని రకాల బస్ పాస్ ధరల్లో మార్పు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (08:25 IST)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) గుట్టుచప్పుడుకాకుండా ప్రయాణ చార్జీలను ధరలు పెంచేసింది. ఇప్పటికే రౌండప్ పేరుతో చార్జీలను ఆర్టీసీ సంస్థ బస్సు చార్జీలు పెంచేసింది. ఇపుడు మరోమారు చార్జీలను పెంచేసింది. ప్యాసింజర్ సెస్ పేరిట మరోమారు చార్జీలను పెంచేసింది. అదేసమయంలో బస్ పాస్‌ల రేట్లను కూడా పెంచుతున్నట్టుగా ఆర్టీసీ సోమవారం ప్రకటించింది. పెంచిన బస్ పాస్ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 
 
పెరిగిన బస్ పాస్ ధరలను ఓసారి పరిశీలిస్తే, ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.970గా ఉండగా దీన్ని రూ.1150కు పెంచేసింది. అలాగే, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ధరను రూ.1070 నుంచి రూ.1300 వరకు పెంచింది. 
 
డీలక్స్ బస్ పాస్ ధర రూ.1185 నుంచి రూ.1450 వరకు పెంచేసింది. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ ధరలను రూ.1100 నుంచి రూ.1350కి గుట్టుచప్పుడు కాకుండా పెంచేసింది. ఇకపోతే, పుష్పక్ ఏసీ బస్ పాస్ ధరను రూ.2500 నుంచి రూ.3000కు పెంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwa : జీవితంలో ముగ్గురిని మాత్రం మర్చిపోకండి అంటూ శర్వా పాఠాలు

Allu Arjun,: రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్, పవన్, చిరంజీవి, నీహారిక

Namit Malhotra: రామాయణం గురించి అప్ డేట్ ఇచ్చిన నమిత్ మల్హోత్రా

Ramcharan: సూడబ్బి.. ఆటే నా పొగరు అంటున్న పెద్ది పెహెల్వాన్

పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వగానే 'బ్రో-2' : దర్శక నటుడు సముద్రఖని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

తర్వాతి కథనం
Show comments